<?xml version="1.0" encoding="UTF-8"?><song><lyrics>[C1]
   ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
   అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

[V1]
 నా పాపము బాప నరరూపివైనావు
 నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
 నాకు చాలిన దేవుడవు నీవే
 నా స్థానములో నీవే (2) // ఎందుకో //

[V2]
 నీ రూపము నాలో నిర్మించియున్నావు
 నీ పోలికలోనే నివసించుమన్నావు
 నీవు నన్ను ఎన్నుకొంటివి
 నీ కొరకై నీ కృపలో (2) // ఎందుకో //

[V3]
 నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
 నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
 నన్ను నీలో చూచుకున్నావు
 నను దాచియున్నావు (2) // ఎందుకో //

[V4]
 నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
 నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
 నీవు నేను ఏకమగువరకు
 నన్ను విడువనంటివే (2) // ఎందుకో //

[V5]
 నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
 నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
 ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
 నేనేమి చెల్లింతున్ (2) // ఎందుకో //</lyrics>
<title>ఎందుకో నన్నింతగా నీవు</title>
<hymn_number>53</hymn_number>
</song>